ప్రేక్షకులు లేకుండా మెగా టోర్నీ వద్దు.. ప్లీజ్‌

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్‌కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తేనే మంచిదని న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెకల్లమ్‌ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్‌ నివారణ అనేది ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేకపోవడంతో ప్రధాన క్రీడా ఈవెంట్లను వచ్చే ఏడాదికి జరిపితేనే మంచిదన్నాడు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్‌కప్‌ను తదుపరి ఏడాదికి  వాయిదా వేస్తూ ముందుగానే నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణ అంశంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసిన తరుణంలో మెకల్లమ్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. (‘ధోనికి చాన్స్‌ ఇవ్వడం బాధించింది’)